వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ స్పందన
- విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం
- 8 మంది దుర్మరణం
- ప్రమాద ఘటనపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన లోకేష్
- క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడి
- ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలను పర్యవేక్షిస్తోందని స్పష్టీకరణ
విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కార్మికులు మృతిచెందడం తీరని విషాదమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
ఈ దుర్ఘటనపై స్పందించిన మంత్రి లోకేష్, "విశాఖ స్టీల్ ప్లాంటు ప్రమాదంలో కార్మికులు మృతిచెందటం తీరని విషాదం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని అన్నారు.
ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని లోకేష్ తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యం, సహాయక చర్యలను ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.